మియా ఖలీఫా: పోర్న్‌ రంగాన్ని వదిలేసినా గతం వెంటాడుతోంది

  • 15 ఆగస్టు 2019
మియా ఖలీఫా Image copyright @MIAKHALIFA

ప్రముఖ పోర్న్ స్టార్ మియా ఖలీఫా తన కెరియర్ గురించి మొదటిసారి బహిరంగంగా మాట్లాడారు.

అమెరికా రచయిత మెగన్ అబోట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన మియా ఖలీఫా.. పోర్న్ తయారు చేసే కంపెనీలపై ఆరోపణలు చేశారు. ఆ కంపెనీలు అమాయక యువతులను వల్లో వేసుకుంటూ ఉంటాయని అన్నారు.

ఇప్పటివరకూ తన గతాన్ని స్వీకరించలేకపోతున్నానని మియా ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

26 ఏళ్ల మియా ఖలీఫా పోర్న్ ఇండస్ట్రీలో మూడు నెలలే పనిచేశారు. 2014 అక్టోబర్‌లో పోర్న్ ప్రపంచంలోకి వచ్చిన ఆమె 2015 ప్రారంభంలో దాన్ని వదిలేశారు. పోర్న్ ప్రపంచం నుంచి బయటికొచ్చే సమయానికే ఆమె పోర్న్‌హబ్ అనే వెబ్‌సైట్‌లో ఒక ప్రముఖ స్టార్ అయిపోయారు.

"పోర్న్ ఇండస్ట్రీలో నేను కోట్లు సంపాదిస్తున్నానని అందరూ అనుకుంటారు. కానీ నేను ఆ పనిలో 12 వేల డాలర్లు (రూ.8.6 లక్షలు) మాత్రమే సంపాదించాను. ఆ తర్వాత నేను దాని నుంచి ఒక్క పైసా కూడా చూళ్లేదు. పోర్న్ రంగాన్ని వదిలేశాక ఏదైనా మామూలు ఉద్యోగం వెతుక్కుందామని వెళ్తే చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి...పోర్న్ భయపెట్టింది" అని మియా ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

మియా తన గతం గురించి మాట్లాడకుండా తరచూ తప్పించుకునేవారు. కానీ ఇప్పుడు కెరియర్‌నే ప్రశ్నార్థకంగా మార్చిన తన గతంలోని ప్రతి కోణాన్నీ వెలుగులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని అంటున్నారు. ఒకవేళ ఆ బిజినెస్ నా పేరు వల్లే నడుస్తూ ఉంటే, దానిని నాకు వ్యతిరేకంగా ఎవరూ ఉపయోగించకూడదు" అన్నారు.

Image copyright Getty Images

నెలల్లోనే టాప్ స్టార్

మియా ఖలీఫా అత్యధికంగా చూస్తున్న పోర్న్ స్టార్ అయ్యారు. కానీ ఆ పని వల్ల తనకెంత పేరొచ్చిందో దానికి సమానంగా తనకు డబ్బులు చెల్లించలేదని ఆమె చెబుతున్నారు.

ఇప్పుడు మియా ఖలీఫా పేరుతో ఒక వెబ్‌సైట్ కూడా నడుస్తోంది. మియా దానికి యజమాని కాదని, ఈ వెబ్‌సైట్ వల్ల ఆమెకు ఎలాంటి లాభాలు లేవని అందులో రాసి ఉంది.

"ఇన్నేళ్లూ నేను ఒకటే అనుకున్నా, ఆ వెబ్‌సైట్‌లో ఎలాగోలా నా పేరు లేకుండా చేయాలి" అని ఆమె అన్నారు.

Image copyright @MIAKHALIFA

మియా ఖలీఫా లెబనాన్‌లో పుట్టారు. ఆమె తన కెరియర్ గురించి మాట్లాడుతూ "పోర్న్ ప్రపంచం నుంచి బయటికొచ్చిన తర్వాత ఉద్యోగం వెతుక్కోవడం చాలా కష్టమైంది" అని చాలా ఓపెన్‌గా చెప్పారు.

"నేను గతంలో చేసిన పనుల వల్ల కంపెనీలు నాకు ఉద్యోగం ఇవ్వలేమని చెప్పినపుడు నాకు చాలా బాధగా అనిపించింది. కానీ, నన్ను పెళ్లాడబోయే వ్యక్తి చాలా మంచివాడు. నా కాబోయే భర్త లాంటి వ్యక్తిని నేనెప్పటికీ వెతకలేనేమో అనిపిస్తోంది" అన్నారు.

మియా ఖలీఫాకు ఈ ఏడాది ప్రారంభంలో రాబర్డ్ సాండ్‌బర్గ్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగింది.

Image copyright Getty Images

ఐసిస్ నుంచి బెదిరింపులు

పోర్న్ ప్రపంచంలో మియా కొంతకాలమే ఉన్నా, వివాదాల నుంచి మాత్రం ఆమె తప్పించుకోలేకపోయారు. బురఖా వేసుకుని షూట్ చేసిన ఒక పోర్న్ వీడియో వల్ల ఆమె ఒక పెద్ద వివాదానికి కారణం అయ్యారు.

ఈ వీడియో బయటికొచ్చిన తర్వాత ఐసిస్ మియా ఖలీఫాను చంపేస్తామని బెదిరించింది.

"ఆ వీడియో పోస్ట్ కాగానే, హంగామా మొదలైంది. నన్ను చంపేస్తామని ఐసిస్ బెదిరించింది. వాళ్లు గూగుల్ మ్యాప్ ద్వారా తీసిన నా ఇంటి ఫొటోలను నాకు పంపించారు" అన్నారు మియా.

"అప్పుడు నేనెంత భయపడిపోయానంటే, రెండు వారాల వరకూ హోటల్ నుంచి కదల్లేదు"

Image copyright Getty Images

మియాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 17 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఆమెకు తరచూ రకరకాల బెదిరింపులు వస్తూనే ఉంటాయి.

"చిన్న చిన్న బెదిరింపులకు నేనిప్పుడు భయపడ్డం లేదు. జనాలు ఏమన్నా అవమానంగా భావించను. నేను వీళ్లు ఐసిస్ వాళ్లా? వీళ్లు నన్ను చంపేస్తారా? లేదుగా?.. సరేలే అనుకుంటా" అని చెప్పారు.

మియా ఖలీఫా తన మొదటి పోర్న్ వీడియోను 2014 అక్టోబర్‌లో రూపొందించారు.

ఆ విషయం గురించి జనాలకు తెలియకూడదని మియా అనుకున్నారు. తను చేస్తున్న వాటిని సీక్రెట్‌గా ఉంచాలనుకున్నారు.

కానీ డిసెంబర్‌ నాటికే ఆమె పోర్న్‌హబ్‌లో నంబర్ వన్ పోర్న్‌స్టార్ అయిపోయారు.


అరాచకంగా మారుతున్న 'స్పై కెమెరా పోర్న్‌' - వీడియో చూడండి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: అరాచకంగా మారుతున్న 'స్పై కెమెరా పోర్న్‌'

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)